మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

– రెండవ రోజు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమ్మె..
 నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీలో పని చేస్తున్నా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం తెలంగాణ  యూనివర్సిటీలో రెండవ రోజు సమ్మె కొనసాగుతోంది. ఈ సందర్భంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మాట్లాడుతూ యూనివర్సిటీ ఏర్పడినప్పటి నుంచి వివిధ సెక్షన్లలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో 272 మంది  పనిచేస్తున్నారని ,   వారికి సరైనటువంటి జీతాలు ఇవ్వటం లేదని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగులందర్నీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మె కు ఐఎఫ్టియు నాయకులు పాల్గొని సంపూర్ణ మద్దతు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.