ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం ..

Our mission is to serve people..Innovation..– చిర్ర యాదగిరి జ్ఞాపకార్థంగా స్మశాన వాటిక గ్రామానికి అంకితం

– కుమారులు చిర్ర బ్రదర్స్ గ్రామ మాజీ ఉపసర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్, చిర్ర వెంకట్ గౌడ్
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని బ్రాహ్మణ కొత్త పల్లి గ్రామ అభివృద్ధి కోసం పేద ప్రజల క్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని చిర్రా బ్రదర్స్ అయినా ఆ గ్రామ మాజీ ఉపసర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్, చిర్రా వెంకట్ గౌడ్ లు అన్నారు. మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో ఆదివారం మా తండ్రి అయినా చిర్ర యాదగిరి స్మారకార్థంగా స్మశానవాటికను సొంత ఖర్చులతో నిర్మించి ప్రారంభించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం మా సొంత నిధులతో ఎన్నో రకాలైన కార్యక్రమాలను చేశామని అన్నారు. పేద ప్రజల బ్రతుకులు మార్చేందుకు మా చిర్ర బ్రదర్స్ ముందుంటుందని తెలిపారు. ఈ గ్రామంలో ప్రభుత్వం స్మశాన వాటికను గతంలో ఏర్పాటు చేసిందని ,కానీ ఇది ఒక ప్రక్క ఊరు  చివరికి ఉండడంతో మరో ప్రక్క చివర ఉన్నటువంటి ప్రజలు దూరం ఉందని రాలేకపోతున్నారని తెలిపారని అన్నారు.దానికి కొంతమంది ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని ప్రజలు చాలా రోజుల నుండి కొంతమంది ఇబ్బంది పడుతున్నారని ఇది నిర్మించాలని  గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు పెరుమాండ్ల చంద్రమౌళి(నవ తెలంగాణ విలేకరి) అనే వ్యక్తి ప్రజలు సంవత్సరం కాలం నుండి అనేకసార్లు కోరుతున్నారని మా దృష్టికి తీసుకువచ్చారని, వారి కోరిక మేరకు ఈ స్మశాన వాటికను మా సొంత నిధులతో నిర్మించామని అన్నారు. ఈ స్మశాన వాటికను నిర్మిస్తున్న క్రమంలో జల సోమయ్య నిర్మించేందుకు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేదని అన్నారు. పేద ప్రజల అభివృద్ధి కోసం మరియు విద్యార్థుల భవిష్యత్తు కోసం వృద్ధుల అవసరాల నిమిత్తం ఎన్నో రకాలైన కార్యక్రమాలు ఏర్పాటు చేసి గ్రామ అభివృద్ధి చేసేందుకు అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశామని అన్నారు. భవిష్యత్తులో కూడా గ్రామ అభివృద్ధి కోసం ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయని వాటిని చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చింతకుంట్ల యాకయ్య, మురళి, బొల్లు అశోక్ , తాళ్ల మహిపాల్ రెడ్డి, సింగారపు రాకేష్, పెరుమాండ్ల సుమన్, బొల్లు రమణ, ఎస్.కె  అజీమ్, చారి ఉమేష్, తాళ్ల పెద్ద ప్రభాకర్, పిఎసిఎస్ డైరెక్టర్ జెల్లా సోమయ్య ,పెరుమాళ్ళ శ్రీనివాస్ ,పెరుమాండ్ల శ్రీధర్, పెరుమాండ్ల లింగమూర్తి. నల్ల మాస సుధాకర్, తాళ్ల రాంరెడ్డి ఏర్పుల ప్రభాకర్, తాళ్ల సమ్మిరెడ్డి, చింతకుంట్ల ఉప్పలయ్య, ఏర్పుల రాములు, పిడుగు వీరభద్రం ,జిల్లా యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.