– కోహెడ నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు
నవతెలంగాణ-కోహెడ: హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెసే బీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌కే మా మద్దతు ఉంటుందని ఫ్యాక్స్ ఛైర్మన్ పెర్యాల దెవేందర్‌రావు ఆధ్వర్యంలో కోహెడ నాయిబ్రాహ్మణ సంఘం నాయకులు తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని నాయిబ్రాహ్మణ కుల సంఘంలో ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయిబ్రాహ్మణులకు విద్యుత్ ఛార్జీలను మినహాయింపునిచ్చి ప్రభుత్వం తమకు అండగా నిలిచిందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందిన ఎమ్మెల్యే సతీష్‌కుమార్ మరొకసారి ఎమ్మెల్యేగా లిపించుకుంటామని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రావణపల్లి కనకయ్య, శ్రావణపల్లి శ్రీనివాస్, తూముల శ్రీధర్, శ్రావణపల్లి శేఖర్, గడ్డం మహేష్, రాజేష్, కనకయ్య, విశ్వనాథ్, రవి, లచ్చయ్య, తిరుపతి, రమేష్, వెంకన్న, రాజేష్, వెంకటేష్, సాగర్, కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.