నవతెలంగాణ- తిరుమలగిరి
మాదిగ సామాజిక వర్గానికి చెందిన తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మందుల సామేలుకే మా మాదిగల మద్దతు అని ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ నాయకులు కందుకూరి సోమన్న అన్నారు. సోమవారం తిరుమలగిరి మండల కేంద్రం బాలాజీ ఫంక్షన్ హాల్ లో తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి సమావేశం ఎమ్మార్పీఎస్ తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి బాలయ్య అధ్యక్షతన జరిగిన ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల. తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన వ్యక్తి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే స్థానికుడైన మాదిగ సామాజిక వర్గానికి చెందిన మందుల సామేలుకి. తుంగతుర్తి నియోజకవర్గంలోని మాదిగ ప్రజలంతా రాజకీయాలకతీతంగా ఓటు వేసి గెలిపించాలని తెలిపారు .గత పది సంవత్సరాలుగా తుంగతుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అనేక రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మాదిగల పై జరుగుతున్న వివక్షత దాడులు దౌర్జన్యాలు అక్రమ కేసులను నిరసిస్తూ నిస్వార్ధ పరుడైన ప్రజల మనిషి సౌమ్యుడు మందుల సామేలు కి మాదిగ సామాజిక వర్గం మొత్తం పార్టీలకు అతీతంగ ఓట్లు వేయాలని. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని అన్ని మండల కమిటీలు ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది అన్నారు. మరియు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి తుంగతుర్తి నియోజకవర్గం లోని ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ప్రజాస్వామిక వాదులు.విద్యార్థులు మేధావులు ఉపాధ్యాయులు. అన్ని వర్గాల ప్రజలు. రాజకీయాలకు అతీతంగా స్థానికుడైన మందుల సామేలు కి అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో. వీహెచ్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం కాసిం,ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి బొజ్జ సైదులు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర రాష్ట్ర ఉపాధ్యక్షులు బోడ సునీల్,ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీ సీనియర్ నాయకులు కందుకూరు శ్రీను,ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు చెడుపాక గంగరాజు, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్వాయి పరశురాముల, ఎమ్మార్పీ జిల్లా కార్యదర్శి కొండగడపల శ్రీను, ఎం ఎస్ పి జిల్లా కమిటీ నాయకులు రాంబాబు గౌడ్,సింధు హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గడ్డం లక్ష్మయ్య, ఎమ్మార్పీఎస్ తిరుమలగిరి మండల అధ్యక్షుడు పడిశాల ప్రశాంత్,ఎమ్మార్పీఎస్ మోత్కూరు మండల శాఖ అధ్యక్షులు కూరెల్ల శ్రీరాములు,ఎమ్మార్పీఎస్ శాలిగౌరారం మండల ఇన్చార్జి ఎర్ర రాములు,ఎమ్మార్పీఎస్ శాలిగౌరారం మండల సీనియర్ నాయకులు పోలేపాక దాసు, అరవపల్లి మండల ఇన్చార్జి ఇటుకల చిరంజీవి,కందుకూరి చంద్రయ్య, రవి, మహేష్, బోడ సోమయ్య,.మల్లెపాక గణేష్, అంబేద్కర్, మల్లేష్,తాటిపాముల సుధీర్, దేవరకొండ కృష్ణమూర్తి, గొల్ల సౌలు, దంతాలపల్లి యాకస్వామి,ధర్మారపు చరణ్, వడ్డేపల్లి యాదగిరి, కురెల్ల నరసింహ, దాసరి బిక్షం,చెరుకు అల్లయ్య, యాదగిరి కూరెల్ల నరసింహ, పల్లె నరసింహ, పోలపాక సుధాకర్,మల్లెపాక శీను, శ్రీకాంత్, ఐలపాక పరమేష్, అనీల్, తుడి ప్రవీణ్,తదితరులు పాల్గొన్నారు.