35 శాతం ఓట్లు..10 సీట్లు మా లక్ష్యం

– ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో 35 శాతం ఓట్లు, పది సీట్లే లక్ష్యంగా పనిచేస్తున్నామని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్‌కు ముందు ఆనవాయితీగా ఉభయ సభలను ఉద్దేశించి చేసిన రాష్ట్రపతి ప్రసంగం నూతన ఒరవడి అన్నారు. బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ రెండూ తోడు దొంగ పార్టీలేనని విమర్శించారు. కాళేశ్వరంతో పాటు ఓఆర్‌ఆర్‌, ధరణి, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతికి మూలస్తంభాలు అని చెప్పిన రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు.