మన ఊరు మనబడి బిల్లులు చెల్లించాలి

– డిమాండ్‌ చేసిన ఎంపీటీసీలు
– 200 యూనిట్లు దాటితే మొత్తం చెల్లించాలి
– ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్లు, వెల్పర్‌లను వెంటనే నియమించాలి
– ఎంఈఓపై అగ్రహం వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులు అధికారులు
నవతెలంగాణ-వికారాబాద్‌డెస్క్‌
స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మండల అధ్యక్షురాలు జేదుపల్లి విజయలక్ష్మి హనుమంత్‌ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండల సర్వసభ్య సమావేశం వాడి వేడిగా కొనసాగింది. ఈ సమావేశంలో గ్రామాలలో నెలకొన్న సమస్యలను సభా దృష్టికి ఎంపీటీసీలు తీసుకువచ్చారు. మండలంలో ఇప్పటివరకు చాలామంది రైతులకు రైతుబంధు డబ్బులు రాలేదని మన ఊరు మన బడిలో పనులు చేసిన బిల్లులు ఇప్పటివరకు రాలేదని పలువురు ఎంపీటీసీలు సభ దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. సర్వసభ్య సమావేశానికి మండల విద్యాధికారి హాజరు కాకపోవడంతో ప్రజాప్రతినిధులు మండల అభివృద్ధి అధికారి ఎంఈఓపై అగ్రహం వ్యక్తం చేశారు. సభకు హాజరు కాకుండా కింది స్థాయి సిబ్బందిని పంపించడం ఏమిటి అని విద్యాశాఖకు సంబంధించిన వివరాలు ఎలా తెలుస్తాయని మండిపడ్డారు. మండల అభివృద్ధి అధికారి నర్సింలు మాట్లాడుతూ మండలానికి పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పన కోసం 2.56 లక్షలు మంజూరు అయినట్లు 48 పాఠశాలలో 25 శాతం పనులు పూర్తి అయినట్లు 55 లక్షల రూపాయలు మంజూరు చేసి మైనర్‌ రిపేర్‌ మేజర్‌ రిపేర్లు చేస్తున్నారని బడిబాట కార్యక్రమం కొనసాగుతుందని 5 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని పాఠశాలలో ఉండేవిధంగా చూస్తున్నామని అందుకోసం కమిటీలను వేయడం జరిగిందని ప్రయివేటు పాఠశాలలో చదివే పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ప్రయివేటు పాఠశాలలు చదవడం కంటే ప్రభుత్వ పాఠశాలలో చదవడం ఎంతో ముఖ్యమని అన్నారు. ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ స్వాతి మాట్లాడుతూ గర్భిణులకు ఐరన్‌ టాబ్లెట్లు ఇవ్వడం జరుగుతుందని చిన్నపిల్లల అందరికీ వ్యాక్సిన్‌ వేస్తున్నామని వర్షాకాలం సంభవించడంతో గ్రామాలలో తాగేనీరు కలుషితం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటే తాగునీరు కలుషితం కాకుండా ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉందని అలాగే కుష్టి క్షయ వ్యాధులపై ఇంటింటి సర్వే నిర్వహించినట్లు వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్సలు అందిస్తున్నట్టు గర్భిణీ స్త్రీలకు ఫస్ట్‌ టీడీ ఇంజక్షన్‌లు టీడీ ఇంజక్షన్‌లు శిశువులకు బిసిజి వ్యాక్సిన్‌లు డెలివరీలు చేస్తున్నట్లు సభ దృష్టికి తీసుకువచ్చారు. గహ జ్యోతి కింద 200 యూనిట్లు ఫ్రీ కరెంట్‌ అమలు అవుతుందని గత మూడు నెలలుగా కరెంటు బిల్లులు వసూలు చేయలేదని మండలంలో అక్కడక్కడ లూజ్‌ వైర్లు వేలాడుతూ ఉన్నాయని వాటిని సరిచేయడానికి ప్రయత్నం చేసే లోపే భారీ వర్షానికి నాగారం గ్రామంలో చెట్లు విరిగి వైర్లపై పడడంతో ఎక్కడి స్తంభాలు అక్కడే విరిగిపోయాయని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా 24 గంటల్లో తిరిగి కరెంట్‌ పునరుద్ధరించామని సభా దష్టికి తీసుకురాగా మండల విద్యుత్‌ శాఖ ఏఈ వేణుగోపాల్‌ రెడ్డిని ఎంపీటీసీ శ్వేత నారోతం రెడ్డి అభినందించారు. మా గ్రామంలో అకాల వర్షానికి విరిగిపోయిన కరెంటు స్తంభాలను ఎన్నడు లేని విధంగా కష్టపడి వెంటనే సరి చేయడం జరిగిందని విద్యుత్‌ శాఖ ఏఈకి ధన్యవాదాలు తెలిపారు. మండలంలో అంపల్లి, రాజాపూర్‌, హౌస్‌పల్లి, కుమ్మర్‌ పల్లి, గురుదొట్ల, నాగ్‌ సాన్‌పల్లి, గ్రామాలలో గ్రామపంచాయతీ భవనాలు ప్రగతిలో ఉన్నాయని కేవలం మైలారం గ్రామపంచాయతీ భవనం పూర్తయిందని గడ్డమీద గంగారం నుండి రోడ్డు పనులు చేయవలసి ఉందని త్వరలో పూర్తి చేస్తామని ఆర్‌అండ్‌బి అధికారులు గత ఐదు సంవత్సరాల నుండి ఒక్క సభకు కూడా హాజరు కాలేదని కేరెళ్ళి ఎంపీటీసీ అగ్రహ వ్యక్తం చేశారు. 24-25 సంవత్సరం గాను ధారూర్‌ దోర్నాల్‌లో పది హెక్టార్లలో మొక్కలు నాటడం జరిగిందని మరో 30 హెక్టార్లలో మొక్కలు నాటుతున్నామని చనిపోయిన మొక్కల స్థానంలో మరో మొక్కలను నాటుతున్నామని అంపల్లిలో ఉన్న నర్సరీలో 20వేల పెద్ద మొక్కలు అందుబాటులో ఉన్నాయని ఇండెంట్‌ తీసుకొని మొక్కలను తీసుకోవాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ విజయ నాయక్‌, మండల అభివృద్ధి అధికారి బి,నర్సింలు, మండల తహసీల్దార్‌ షాజిదా బేగం, డిప్యూటీ తహసీల్దార్‌ విజరు, మండల పంచాయతీ అధికారి షఫీ ఉల్లా ఖాన్‌, మిషన్‌ భగీరథ డిఈ రత్న ప్రసాద్‌, వ్యవసాయ అధికారి ఝాన్సీ లక్ష్మీబాయి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ శాంత, ఎంపీటీసీలు శ్వేత నారోతం రెడ్డి, బసప్ప, శ్రీనివాస్‌, ఏపీవో సురేష్‌, ఫారెస్ట్‌ అధికారి జగన్మోహన్‌, గ్రామపంచాయతీ కార్యద ర్శులు తదితరులు పాల్గొన్నారు.