మాది ప్రజా పాలనా.. ఫామ్ హౌజ్ పాలన కాదు

Ours is public governance.. not farm house governance– సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి
నవతెలంగాణ-  సిరిసిల్ల
కాంగ్రెస్ పార్టీది ఫామ్ హౌస్ పాలన కాదని, ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా పాలన కొనసాగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు సిరిసిల్లలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆదివారం స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాటమీద నిలబడి ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని, గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతుందని అన్నారు. మొదటి విడత 32 వేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. రైతును రాజుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, మిగతా 2 విడతల్లో పూర్తిస్థాయి రెండు లక్షల రుణమాఫీని ప్రభుత్వం చేసి తీరుతుందన్నారు
కేసీఆర్ లాగా ఫామ్ హౌస్ లో ఉండి నిర్ణయాలు తీసుకోవడంకాదు, మంత్రులందరూ కమిటీగా ఏర్పడి రుణమాఫీ విధివిధానాలను రూపొందించాలని రైతుబంధు పథకం పై కూడా ప్రజాభిప్రాయాలు సేకరిస్తున్నం..రుణమాఫీపై మాట్లాడే అర్హత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు లేదని, పీఠాలు కదులుతున్నాయనే, పిచ్చి పట్టినట్లు తలా తోకా లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.రుణమాఫీ చెయ్యకపోతే రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే, రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీష్ రావు ఇప్పుడు ఆరుగ్యారెంటీల పేరిట మాట మారుస్తున్నాడని నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగం నోటిఫికేషన్ ప్రభుత్వం ఇచ్చింది, ఇచ్చిన నోటిఫికేషన్లు రద్దు చేయాలని, కొంతమందిని రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి కోసం దొంగ దీక్షలు కొందరు నేతలు చేపిస్తున్నారు. సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు  చేస్తున్నం. రాహుల్ గాంధీ ఇచ్చిన రుణమాఫి అమలు చేసామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న హామీల అమలను చూసి ఓర్వలేక టిఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని గత బీఆర్ఎస్ అవినీతి అరాచక పరిపాలనలో ప్రజలు ఇబ్బంది పడ్డారని ఆయన అన్నారు.
రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి ప్రజల నెత్తిపై అప్పు బారాన్ని మోపిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వం ది ఎంత ఆర్థిక భారమైన రైతులను ఆదుకొనే ఉద్దేశ్యంతో రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని ఆయన అన్నారు ఎంత ఆర్థిక భారమైన రైతులను ఆదుకొనే ఉద్దేశ్యంతో రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని అన్నారు కవితను బయటకు తీసుకురవడానికి బావ బమ్మర్డులు డిల్లీకి పోయి జరిపిన మంతనాలు అందరికీ తెలిసినవేనని అన్నారు హరీష్ రావు మంచోడు అంటున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. కేటీఆర్ ను కూడా అనొచ్చు కదా?దీన్ని బట్టే అర్థమవుతోంది బీజేపీ కి, బీఆర్ఎస్ దోస్తానా అని ప్రజలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉంది ప్రతిపక్షాల కుట్ర నమ్మే వారు లేరని అన్నారు. సమావేశం లో నియోజకవర్గ ఇంచార్జి  కెకె మహేందర్ రెడ్డి తో పాటు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్,తంగాళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ జె టోనీ,జిల్లా చేనేత అధ్యక్షులు గోనె ఎల్లప్ప,ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు బాలరాజు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుర దేవరాజు, జిల్లా నాయకులు గడ్డం నర్సయ్య,వైద్య శివ ప్రసాద్,కత్తెర దేవదాస్,మ్యాన ప్రసాద్,మాజీ ఎంపీటీసీ బైరినేనీ రాము, బిమావరం శ్రీనివాస్, అడ్డగడ్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.