
నవతెలంగాణ- బోధన్ టౌన్
బోధన్ పట్టణంలో శక్కర్ నగర్ క్రీడా స్థలంలో బిఆర్ఎస్ పార్టీ బూత్ మీటింగ్ లో బుధవారం ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. బోధన్ లో బీఆర్ఎస్ బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి హాజరైన ఆమె.. బీఆర్ఎస్ అంటే మన ఇంటి పార్టీ అని అన్నారు. మనది పేగుబంధం.. వాళ్లది ఓటు బంధం అని తెలిపారు. బోధన్ లో 10వేల మంది బీడీ కార్మికులకు పెన్షన్ అందిస్తున్నామని, 152 చెరువులను బాగు చేసుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ. 4వేల పెన్షన్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు.