– వెనుకంజలో సర్కారు బడులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ రంగంలోని గురుకుల పాఠశాలలు సత్తాచాటాయి. తెలంగాణ గురుకులాలు 98.25 శాతం ఉత్తీర్ణత సాధించి యాజమాన్యాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఎస్సీ గురుకులాలు 95.24 శాతం, బీసీ గురకులాలు 95.03 శాతం, మైనార్టీ గురుకులాలు 94.66 శాతం, గిరిజన గురుకులాలు 92.93 శాతం ఉత్తీర్ణతను నమోదు చేశాయి. రాష్ట్రంలోని ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల కంటే మెరుగైన ఫలితాలు సాధించడం గమనార్హం. ప్రయివేటు పాఠశాలల్లో 90.9 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక ప్రభుత్వ పాఠశాలలు పదో తరగతి ఫలితాల్లో వెనుకంజలో ఉన్నాయి. 72.39 శాతం ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. జిల్లా పరిషత్ బడుల్లో 79.14 శాతం ఉత్తీర్ణత వచ్చింది.
యాజమాన్యాల వారీగా ఉత్తీర్ణత వివరాలు
యాజమాన్యం | విద్యార్థుల హాజరు | ఉత్తీర్ణత | శాతం |
తెలంగాణ గురుకుల | 2,680 | 2,633 | 98.25 |
ఎస్సీ గురుకుల | 18,000 | 17,144 | 95.24 |
బీసీ గురుకుల | 18,001 | 17,106 | 95.03 |
మైనార్టీ గురుకుల | 10,773 | 10,198 | 94.66 |
గిరిజన గురుకుల | 7,337 | 6,818 | 92.93 |
మోడల్ స్కూళ్లు | 18,213 | 16,629 | 91.3 |
ప్రయివేటు పాఠశాలలు | 2,16,060 | 1,96,403 | 90.9 |
కేజీబీవీ | 16,702 | 14,006 | 83.86 |
ఎయిడెడ్ | 6,933 | 5,813 | 83.85 |
జిల్లా పరిషత్ | 1,39,922 | 1,10,738 | 79.14 |
ఆశ్రమ పాఠశాలలు | 8,254 | 6,411 | 77.67 |
ప్రభుత్వ పాఠశాలలు | 21,495 | 15,561 | 72.39 |
మొత్తం | 4,84,370 | 4,19,460 | 86.60 |