
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బస్వాపూర్ గ్రామములోని ఎంపీయూపీఎస్ పాఠశాలో శనివారం నాడు హెత్ జయంచంద్ ఆధ్వర్యంలో పేరెంట్స్ సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా సమావేశం లో హెచ్ఎం జయచంద్ మాట్లాడుతూ.. పాఠశాలలోని విద్యనబ్యసిస్తున్న విద్యార్థులు పౌష్టికాహరం లోపంతో ఉన్న వారిని గుర్తించి ప్రత్యేకంగా వారికి వైద్యం తో పాటు తీసుకోవాల్సిన ఆహర నియమాలను తెలియ చేయడం జర్గింది. అదేవిధంగా బడి బయటి పిల్లలను బడిలో చెర్పించాలని, డ్రాప్ అవుచ్ లేకుండా చూడాలని, పిల్లలను పనిలో పెట్ట వద్దని అది నేరంగా పరిగణించడం జర్గుతుందని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం జయచంద్ , ఉపాద్యాయులు , ఎల్ ఎన్ గౌడ్ , మధు , పిల్లల తల్లిదండ్రులు , గ్రామస్తులు తదితరులు పాల్గోన్నారు.