బడిబయట పిల్లల గుర్తింపు సర్వే..

నవతెలంగాణ- పెద్దవంగర
బడి బయటి పిల్లలను గుర్తించేందుకు సీఆర్పీలు సర్వే చేపడుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం గంట్లకుంట ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కన్న శ్రీనివాసరావు, సీఆర్పీ రమాదేవి (ఓఎస్సీ) సర్వే చేపట్టారు. గ్రామంలో శార్ల శైలజ 4వ తరగతి, శార్ల మంజుల, శార్ల శ్రీను 1 వ తరగతిలో గుర్తించి, బడిలో చేర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ..బడి బయట పిల్లలందరినీ తల్లిదండ్రులు పాఠశాలకు పంపించాలని సూచించినట్లు తెలిపారు. కాగా మండలంలో 6 నుంచి, 14, 15, 19 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలు పాఠశాలకు వెల్లకుండా ఉన్న వారిని గుర్తించి, సమీప పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఈ సర్వే వచ్చే ఏడాది జనవరి 10 వరకు కొనసాగనుంది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.