‘ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి’

నవతెలంగాణ-వికారాబాద్‌ కలెక్టరేట్‌
20 ఏండ్ల నుండి ప్రభుత్వ ఆస్పత్రులలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో సేవలందిం చిన సిబ్బందిని తీసివేయడంతో తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సంగీత టీఎం హెచ్వో సీఈటీయూ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎన్‌ రఘు రాజ్‌ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్‌ రఘురాజ్‌ మాట్లా డుతూ ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్‌, జీఎన్‌ఎమ్‌, బీఎస్సీ నర్సింగ్‌,గా క్వాలిఫై అయి కొన్నేండ్లుగా టీవీ వీపీవిపి, డీహెచ్‌, ఎంసీహ్‌, డీఎంఈ పరిధిలోని మెడికల్‌ కాలే జీలు, జనరల్‌ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీలలో ఔట్‌ సోర్సింగ్‌ పద్దతిలో సేవలందించామని, మహమ్మారి కోవిడ్‌ -19 లో మా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించామని ఫార్మాసిస్ట్‌, స్టాఫ్‌ నర్సల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా స్టాఫ్‌ నర్సులను, ఫార్మాసిస్ట్‌ రెగ్యులర్‌ ఉద్యగులను నియామంచడం వలన ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను విధుల నుండి తొలగించడం చాలా అన్యాయమన్నారు. ఇన్నేండ్లు ఇదే వత్తిపై ఆధారపడి కుటుంబాలను పోషిం చుకుంటూ ఉన్న ఫార్మసిస్ట్‌, స్టాఫ్‌నర్స్‌లను అర్ధంతరంగా తొలగించడంతో వీరి కుటుంబాలు రోడ్డున పడ్డాయాని పిల్లల చదువులు, ఇంటి కిరాయి, కుటుంబ పోష ణ కష్టంగా మారిందనీ వీరు ఇన్నేండ్లుగా చేసిన సేవల ను గుర్తించి ఎన్‌హెచ్‌ ఎం, డీఎంఈ, ఆర్‌బీఎస్‌ కే, టీవీవీపీలలో ఫార్మాసిస్ట్‌, స్టాఫ్‌ నర్సు ఖాళీలు నేరుగా లేదా కాంట్రాక్టు పద్దతిలో తొలగించిన ఉద్యోగులకు ప్రాముఖ్యత ఇచ్చి ఉద్యోగం ఇపించగలరని వీరిపై ఆధారపడ్డ కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ మెడికల్‌ హ్యాండ్‌ హెల్త్‌ ఔట్సోర్సింగ్‌ కాంటాక్ట్‌ ఎం ప్లాయిస్‌ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు విజయకుమార్‌, ఫార్మ సిస్ట్‌ అనూష, సంతోష, వినోద, లక్ష్మి, మంజుల, శశికళ తదితరులు పాల్గొన్నారు.