పశుసంవర్ధక శాఖ లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేవు…?

– మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు..?
– పట్టించుకోని శాఖ అధికారులు..?
నవతెలంగాణ -కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పశు సంవర్దక శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉద్యోగుల కుటుంబ సభ్యులు 3 నెలలుగా జీతాలు లేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. అలాగే మార్చు 31 సంవత్సరికం పూర్తికాగానే ఇప్పటివరకు వారికి జీతాలు ఇవ్వకపోవడంతో తమ కార్యాలయ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ పట్టించుకోవడంలేదని తమ ఆవేదనను ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే మార్చ్ 31 అనగా సంవత్సరికం ముగిసింది. అయినా మూడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా వారిని పనిచేయించుకుంటూ ఒత్తిడికి గురి చేస్తున్నారని ఉద్యోగులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ తమ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా తమ జీతాలను త్వరగా ఇప్పించాలని కోరుతున్నారు లేనియెడల ఉద్యమానికి ఉధృతం చేస్తూ కలెక్టరేట్ ముట్టడి లేదా కలెక్టరేట్ ధర్నాకు పిలుపునిస్తామని శాఖకు చెందిన ఉద్యోగులు తెలియజేస్తున్నారు. ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారికి తమ జీతాల విషయమై ఉద్యోగులందరూ కోరగా పట్టించుకోవడంలేదని అలాగే ఇప్పటికైనా తమ శాఖ అధికారి ఉద్యోగులపై చిన్నచూపు చూడకుండా తమ జీవితాలు వచ్చే విధంగా కృషి చేయాలని కోరుతున్నామని బాధపడుతున్నారు అలాగే వారి కుటుంబ సభ్యులకు కూడా బాధపడుతూ ఆ విధంగా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో పాఠశాలలు ప్రారంభం కావడంతో పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి వారి యొక్క పుస్తకాలు ఫీజులు కట్టలేక ఇబ్బందుల పాలవుతున్నారని వారి ఆవేదనను ఎవరికి చెప్పుకోవాలని తమ ఉన్నతాధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా తమ ఉన్నతాధికారులు తమకు జీతాలు రావడమే కాకుండా తమ కింద పని చేస్తున్నటువంటి ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు సక్రమంగా వచ్చే విధంగా చూడాలని కోరుతున్నామన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్మూర్ బోధన్ నిజామాబాద్ లో 24 మంది పనిచేస్తున్నారని ఉద్యోగులు తెలియజేశారు. ఈ 24 కుటుంబాలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఎలాగైనా తమ జీవితాలను ఇప్పించాలని ఉన్నతాధికారులను జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు.