విద్యుద్ఘాతంతో ఔట్ సోర్సీంగ్ ఉద్యోగి మృతి

– గాగీల్లపూర్ కావేరీ సీడ్స్ అవరణంలో ఘటన
– మృతదేహంతో కుటుంబ సభ్యుల అందోళన
– రూ.30 లక్షలు ఎక్స్ గ్రేసియా అందించాలని సీపీఐ(ఎం) డిమాండ్
– రూ.5 లక్షలు ఎక్స్ గ్రేసీయా ప్రకటించిన కావేరి సీడ్స్ యాజమాన్యం
నవతెలంగాణ-బెజ్జంకి
మొబైల్ చార్జీంగ్ పెడుతున్న క్రమంలో ప్రమాధవశాత్తు విద్యుద్ఘాతానికి గురై ఔట్ సోర్సీంగ్ ఉద్యోగి అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని గాగీల్లపూర్ గ్రామ శివారులోని కావేరి సీడ్స్ అవరణం యందు అదివారం జరిగింది.మృతుని కుటుంబ సభ్యుల వివరాల మేరకు చిన్నకోడూర్ మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన మెట్ల పర్శరాములు(32) అంపీల్ సెక్యూరీటీ సంస్థలో ఔట్ సోర్సీంగ్ ప్రాతిపదికన ఉద్యోగంలో చేరాడు.గతంలో చింతమడకలో పని చేసి బదిలీపై సుమారు గత నాలుగెండ్లుగా గాగీల్లపూర్ గ్రామ శివారులోని కావేరి సీడ్స్ సంస్థ యందు సెక్యూరీటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు.అదివారం ఉదయం మొబైల్ చార్జీంగ్ పెడుతున్న క్రమంలో ప్రమాధవశాత్తు విద్యుద్ఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహం వద్ద రోదనలు మిన్నంటాయి.నిబందనలకు విరుద్ధంగా విద్యుత్ వినియోగించడం వల్ల విద్యుద్ఘాతానికి గురై మృతి చెందాడని బాధిత కుటుంబానికి కావేరి సీడ్స్ యాజమాన్యం న్యాయం చేయాలని మృతుని బందువులు మృతదేహంతో అందోళన చేపట్టారు.మృతునికి భార్య లత(30),కుమారుడు రీషీ(09),కుమార్తె ప్రవీశ్న(06) ఉన్నారు.సమాచారం తెలుసుకున్న ఎస్ఐ ప్రవీన్ రాజు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకుండా పర్యవేక్షణ చేశారు.మృతుని బార్య లత పిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ ప్రవీన్ రాజు తెలిపారు.
ఆర్థిక సహయం కోసం సుమారు 9 గంటలు నిరీక్షణ..
పేదరికంతో కొట్టామిడుతున్న తమ కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయామని.. కావేరి సీడ్స్ యాజమాన్యం మానవత్వంతో తమ కుటుంబానికి అదూకునేల ఆర్థిక సహయమందజేయాలని మృతుని కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి సంఘటన జరిగిన ప్రాంతంలో సుమారు 9 గంటలు మృతదేహంతో నిరీక్షించారు.
రూ.5 లక్షల ఎక్స్ గ్రేసీయా ప్రకటించడం సరైందికాదు
అంపీల్ సెక్యూరీటీ సంస్థ యందు ఔట్ సోర్సీంగ్ ప్రాతిపాదికన ఉద్యోగంలో చేరి విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో కావేరి సీడ్స్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వినియోగించే విద్యుత్ వల్ల మెట్ల పర్శరాములు విద్యుద్ఘాతానికి గురై మృతి చెందడం బాధాకరమని..పెద్ద దిక్కును కోల్పోయిన బాధిత కుటుంబానికి కావేరి సీడ్స్ యాజమాన్యం రూ.30 లక్షల ఎక్స్ గ్రేసీయా ప్రకటించి న్యాయం చేయాలని సీపీఐ(ఎం) పార్టీ పక్షాన డిమాండ్ చేస్తే యాజమాన్యం కేవలం రూ.5 లక్షలు ఎక్స్ గ్రేసియా ప్రకటించడం సరైందికాదని మానకొండూర్ నియోజకవర్గ సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి మాతంగి శంకర్ అసహనం వ్యక్తం చేశారు.