వేసవి ప్రణాళికలో భాగంగా విద్యుత్ శాఖ డిఈ ఆపరేషన్ డిచ్పల్లి ఉత్తం జాడే మండలంలోని మునిపల్లి గ్రామంలో ఓవర్ లోడ్, లో వోల్టేజి నివారణకు, అదనపు 100 కెవిఎ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లు చార్జ్ చేయడం జరిగిందని ఏఈ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రానున్న వేసవిలో విద్యుత్తు డిమాండ్ ని దృష్టిలో పెట్టుకొని, మండలంలోని పలు గ్రామాలలో అదనపు ట్రాన్స్ఫర్లు ఇవ్వడం జరిగిందని, 15కె.వి.ఏ, కెపాసిటీ గల ట్రాన్స్ఫార్మర్లు లక్ష్మాపూర్ గ్రామంలో అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైనిస్పెక్టర్లు లైన్మెన్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.