పొంగుతున్న వాగులు..నిలిచిన రాకపోకలు

Khammam,Navatelangana,Telugu News,Telangana.నవతెలంగాణ-వేంసూరు
మండల పరిధిలోని కందుకూరు ఉపవాగు పొంగి వరద ప్రవాహం పెరగటంతో పంచాయతీ కార్యదర్శి సజ్జ రాజగోపాల్‌ పంచాయతీ సిబ్బంది ముందస్తు ప్రమాదాలను వివరించేందుకు ప్రధాన రహదారిపై వాహనాలను అడ్డుపెట్టి దుద్దపూడి కందుకూరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిపివేశారు. వరద ప్రవాహం పెరిగే అవకాశాలు ఉండటంతో ఉపవాగు సమీపంలో నివాసం ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పంచాయతీ సిబ్బంది పరిశీలిస్తున్నారు.