మండల కేంద్రంలోని జాతీయ రహదారి 365 రోడ్డు మార్గంలో డివైడర్ల మధ్యలో ఏర్పాటు చేసిన చెట్లు ఏపుగా పెరిగి ప్రయాణికులకు ప్రమాదకరంగా మారాయని మండల ప్రజలు ఆరోపణల వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా ఏపుగా పెరిగిన చెట్లు ప్రయాణికులకు అడ్డుగా మారి రోడ్డు దాటే క్రమంలో, యూటర్న్ తీసుకునే క్రమంలో వాహనాలను అంచనా వేయడంలో విఫలమై ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతోమంది నిరాశ్రయులుగా మారారని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా జాతీయ దారుల నిర్వాహకులు పట్టీ పట్టనట్టు ప్రవర్తించడం పై స్థానికులకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డివైడర్ మధ్యలో నాటే చెట్లు ఆహ్లాదానికి ప్రకృతి అందాలకి తావు ఇవ్వాలి కానీ ప్రయాణికులకు ముప్పుగా ఉండకూడదని స్థానికులు మనోభావం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా జాతీయ రహదారుల అధికారులు, నిర్వాహకులు స్పందించి డివైడర్ మధ్యలో పెరిగిన చెట్లను నరికించి ప్రయాణికులకు అండగా నిలచి ప్రమాదాలను అరికట్టాలని స్థానికులు కోరుచున్నారు.