– ఇసుక లారీ బోల్తా
– పగిలిన నల్లా నీళ్ల పైపులు
నవతెలంగాణ-వీణవంక
అతివేగంగా, అజాగ్రత్తగా ఇసుక లారీని డ్రైవర్ నడుపడంతో లారీ బోల్తా పడింది. ఈ ఘటన మండలంలోని ఐలాబాద్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఎస్సై ఆసీఫ్ కథనం ప్రకారం.. మండలంలోని మానేరు తీరం నుండి ఇసుకను తరలిస్తున్న లారీని డ్రైవర్ షరీఫ్ ఖాన్ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపడం వల్ల ఐలాబాద్ గ్రామంలో కుక్క అడ్డుగా రావడం వల్ల దాన్ని ఢీకొనగా లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో అదే ప్రాంతంలో ఉన్న పురంశెట్టి రవి కి సంబంధించిన నల్లా నీళ్ల పైపులు పగిలిపోయాయి. ఈఘటనపై బాధితుడు రవి ఫిర్యాదు చేయగా లారీ డ్రైవర్ షరీఫ్ ఖాన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.