సిరీస్‌ సొంతమాయె

 Own the series– రెండో టీ20లో భారత్‌ గెలుపు
– రాణించిన రుతురాజ్‌, బుమ్రా
డబ్లిన్‌ : టీ20 సిరీస్‌ భారత్‌ వశం. రెండో టీ20లోనూ ఐర్లాండ్‌ను చిత్తు చేసిన టీమ్‌ ఇండియా 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 2-0తో మరో మ్యాచ్‌ ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (58, 43 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌), సంజు శాంసన్‌ (40, 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), రింకూ సింగ్‌ (38, 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), శివం దూబె (22 నాటౌట్‌, 16 బంతుల్లో 2 సిక్స్‌లు) రాణించారు. తెలుగు తేజం తిలక్‌ వర్మ (1) నిరాశపరిచాడు. భారీ ఛేదనలో ఐర్లాండ్‌ పోరాట స్ఫూర్తి చూపించింది. ఓపెనర్‌ ఆండీ బాల్‌బిర్నీ (72, 51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీతో పోరాడాడు. మరో ఎండ్‌ నుంచి భారత బౌలర్లు బుమ్రా (2/15), ప్రసిద్‌ (2/29), బిష్ణోరు (2/37) వికెట్లు పడగొట్టారు. చివర్లో మార్క్‌ ఎడెర్‌ (23) ఆకట్టుకున్నా.. 20 ఓవర్లలో ఐర్లాండ్‌ 8 వికెట్లకు 152 పరుగులే చేసింది. సిరీస్‌లో నామమాత్రపు మూడో టీ20 బుధవారం జరుగుతుంది.