తపస్వి స్వచ్ఛంద సంస్థను సందర్శించిన ఆక్స్ఫర్డ్ విద్యార్థులు..

Oxford students visit Tapasvi Charity.నవతెలంగాణ – ఆర్మూర్ 

పట్టణంలోని మామిడిపల్లి తపస్వి స్వచ్ఛంద సంస్థను గురువారం గాంధీనగర్ ఆక్స్ఫర్డ్ పాఠశాల మేనేజ్మెంట్, విద్యార్థిని, విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా జమ చేసిన డబ్బులను తపస్వి స్వచ్ఛంద సేవ కు అందించారు. వీరి యొక్క సేవ నిరతికి అభినందించారు. ఈ కార్యక్రమంలో తపస్వి ఇంటర్నేషనల్ చైర్మన్ పద్మావతి ,దిలీప్ రెడ్డి, ఆక్స్ఫర్డ్ పాఠశాల చైర్మన్ మానస గణేష్, పద్మ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.