బేకరీలో ఓయన్‌ పేలుడు

– ఇద్దరికి గాయాలు ఒకరి పరిస్థితి విషమం
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
బేకరీలో ఓవెన్‌ పేలిన ఘటనలో ఇద్దరు గాయపడ్డా డు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘట న మైలార్‌దేవ్‌పల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటుచేసు కుంది. పోలీసులు స్థానికులు తెలి పిన వివరాల ప్రకారం పాత బస్తీకి చెందిన వసీం వట్టేపల్లి బి.కె.పురంలో జామ్‌ జామ్‌ బేకరీని నిర్వహిస్తు న్నాడు. రోజు మాదిరిగానే కార్మికుడు ఇజాజ్‌తో కలిసి వసీం బేకరీ పనులు చేస్తుండగా అక్కడ ఉన్న ఓయన్‌ అకస్మాత్తుగా భారీ శబ్దంతో పేలింది. దీంతో ఇద్దరూ ఎగిరి కొంత దూరంలో పడ్డారు. ఇద్దరికీ గాయాలు కావడంతో వెంటనే స్థానికులు వారిని 108లో ఆస్పత్రి కి తరలించారు. ఇందులో వసీం పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు తెలిపారు. అకస్మా త్తుగా భారీ శబ్దం రావడంతో స్థానికులు సిలిండర్‌ పేలి ఉం డవచ్చని భావించారు. కానీ చివ రకు బేకరీని క్షుణ్ణంగా పరిశీలిం చిన తర్వాత ఓయన్‌ పేలి ఈ ఘటన జరిగిందని పో లీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.