రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు పి.అక్షయ ఎంపిక..

P. Akshaya selected for state level kabaddi competitions..నవతెలంగాణ – డిచ్ పల్లి
కామారెడ్డి పట్టణం లో శుక్రవారం  జరిగిన ఎస్ జి ఎఫ్ అండర్/19 రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు మండల కేంద్రంలోని ఖిల్లా డిచ్ పల్లి పరిధిలోని ఆదర్శ కళాశాల కు చెందిన సిఈసి మొదటి సంవత్సరం విద్యార్థిని పి. అక్షయ ఎంపికైనట్లు కళాశాల  ప్రిన్సిపాల్ డాక్టర్ పి  దశరథ్ తెలిపారు. శనివారం  23 నుండి 25  వరకు  రంగారెడ్డి  జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటిల్లో పాల్గొంటారని వివరించారు. పోటిలకు ఎంపిక కావడంతో పీడీ సంజీవ్, అధ్యాపకులు అశోక్, మహేష్, రాణి, గంగప్రసాద్, శ్రీనిజా, కూల్దీప్, సురేష్ అధ్యాపకులు పి అక్షయ ను అభినందించారు.