చౌటుప్పల్ ఏసీపీగా పి.మధుసూదన్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరణ

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ డివిజన్ నూతన ఏసిపిగా పి.మధుసూదన్ రెడ్డి సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఏసీపీగా పనిచేసిన వై.మొగులయ్య హైదరాబాదుకు బదిలీపై వెళ్లారు. హైదరాబాద్ నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసిపిగా విధులు నిర్వహిస్తున్న పి.మధుసూదన్ రెడ్డి చౌటుప్పల్ డివిజన్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఏసీపీ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నూతన ఏసిపి పి.మధుసూదన్ రెడ్డిని చౌటుప్పల్ పట్టణ, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు వి.అశోక్ రెడ్డి,ఏ.రాములు శాలువలతో సన్మానించారు.