ఆర్ఎంపీ అసోసియేషన్ అధ్యక్షునిగా పి. మునీందర్ రెడ్డి

నవతెలంగాణ – ధర్మారం 

మండల ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసమూర్తి ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మండల ఆర్ ఎంపీ, పీఎంపీ, అసోసియేషన్ ఎన్నికలు ఘనంగా నిర్వహించారు. ధర్మారం మండల ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షులుగా బొమ్మ రెడ్డి పలపి గ్రామానికి చెందిన ఆర్ఎంపి డాక్టర్ పుచ్చకాయల మునీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నరసింహులపల్లి గ్రామానికి చెందిన ఆర్.ఎం.పి డాక్టర్ సామల సత్యనారాయణ కోశాధికారిగా కొత్తూరు గ్రామానికి చెందిన డాక్టర్ కే ప్రతాప్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్ లు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు పుచ్చకాయల మునిందర్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో మండల అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఆర్ఎంపీ, పీఎంపీ సభ్యులందరి సమస్యలు పరిష్కరించడానికి తాను కృషి చేస్తానని, వారికి అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరిని కలుపుకొని పనిచేస్తానని హామీ ఇచ్చారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఆర్ఎంపీ, పీఎంపీ సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.