తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: పి.శంకర్

నవతెలంగాణ – మిరుదొడ్డి 
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేసారు. శుక్రవారం మిరుదొడ్డి మండలం లింగుపల్లి కొనుగోలు కేంద్రం లో తడిసిన ధాన్యాన్ని   పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షం వల్ల చెతికి వచ్చిన పంట తమ కండ్ల ముందె తడసిందని రైతులు అవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చెసి తమను అదుకొవాలని రైతులు  విన్నవించారు.ప్రభుత్వం వేంటనే బొనస్ ను చెల్లించి ఎన్నికలలో ఇచ్చిన హమిని నిలబెట్టుకొవాలని అన్నారు. ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్లలతో మాట్లాడి వెంటనే కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని తరలించాలని డిమాండ్ చేశారు రైతులకు అన్ని రకాల వడకు బోనస్ ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో రైతులు బాల నరసింహులు భూమవ్వ , లక్మి,రాజు, శంకర్, బుచ్చవ్వ తదితరులు పాల్గొన్నారు.