నవతెలంగాణ డిచ్ పల్లి: నిజామాబాద్ జిల్లా డిప్యూటీ లేబర్ కమిషనర్ పి యోహన్ మండల ప్రత్యేక అధికారిగా గురువారం మండల పరిషత్ కార్యాలయంలో భాద్యతలను స్వికరించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బందితో సమావేశమయ్యారు. బుదవారంతో మండల ప్రజా పరిషత్ నకు అధ్యక్ష, ఉపాధ్యక్ష ప్రాదేశిక నియోజకవర్గం, జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ కాలపరిమితి ముగిసినందున ప్రభుత్వం మండలాలకు జిల్లాస్థాయి అధికారులను ఇన్చార్జీలుగా నియమించాలని ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రవీందర్, ఎంపిఓ శ్రీనివాస్ గౌడ్ లతోపాటు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.