తెలుగు తెరపైకి ఓ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా రాబోతోంది. తమిళంలో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘డా..డా’ సినిమాని తెలుగులో ‘పా..పా..’ టైటిల్‌తో జెకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత నీరజ కోట విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 13న ఈ చిత్రాన్ని ఆంధ్ర, తెలంగాణతో పాటు అమెరికా, ఆస్ట్రేలియాల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. కవిన్, అపర్ణ దాస్ ప్రధాన పాత్రదారులుగా డైరెక్టర్ గణేష్ కె బాబు తెరకెక్కించిన ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు డిస్ట్రిబ్యూటర్‌లకు కాసుల వర్షం కురిపించింది. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు 30 కోట్లు వసూళ్లు సాధించి, బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో తెరకెక్కి, తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుందని నిర్మాత నీరజ కోట తెలిపారు. కామెడీ, ఎమోషన్స్, ప్రేమ.. ఇవన్నీ సరైన స్థాయిలో మిక్స్ చేసిన ఈ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాకి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అవుతారు. తెలుగలోనూ బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంజీఎం సంస్థ నుంచి అచ్చిబాబు ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారని ఆమె చెప్పారు. భాగ్యరాజా, వీటీవీ గణేష్, ఐశ్వర్య, ప్రదీప్ శక్తి తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్: జెన్ మార్టిన్, సాహిత్యం: రవివర్మ ఆకుల.