‘పా.. పా’ రిలీజ్‌కి రెడీ

'Pa.. Pa' is ready for releaseతమిళంలో సంచలన విజయం సాధించిన ‘డా..డా’ చిత్రాన్ని తెలుగులో ‘పా.. పా..’ టైటిల్‌తో జెకె ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మాత నీరజ కోట విడుదల చేయ బోతున్నారు. ఈనెల 3న ఈ సినిమా ఆంధ్ర, తెలంగాణతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా థియేటర్‌లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇటీవల డైరెక్టర్‌ మారుతి విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్‌ రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ‘కవిన్‌, అపర్ణ దాస్‌ ప్రధాన పాత్రదారులుగా డైరెక్టర్‌ గణేష్‌ కె బాబు తెరకెక్కించిన చిత్రమిది. అతి తక్కువ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా సుమారు రూ.30 కోట్లు వసూళ్లు సాధించి, బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని నమోదు చేసుకుంది. తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో తెరకెక్కి తమిళంలో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన ‘డా..డా’ చిత్రం ‘పా.. పా..’ పేరుతో తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుంది. భావోద్వేగం, ప్రేమ, కామెడీ.. ఇవన్నీ సరైన స్థాయిలో మిక్స్‌ చేసిన ఈ ఫీల్‌ గుడ్‌ ఎమోషనల్‌ డ్రామా ఇది. ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో ఎంజీఎం సంస్థ నుంచి అచ్చిబాబు రిలీజ్‌ చేస్తున్నారు’ అని నిర్మాత నీరజ కోట తెలిపారు.