మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లో రుణమాఫీ పొందిన రైతులకు వెంటనే నూతన రుణాలను అందిస్తామని పిఎసిఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఎల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. మొదటి విడత రుణమాఫీ 18/07/24 వరకు మాఫీ పొందిన వారిలో 98 మంది రైతులు సుమారు 32,12,428 రూపాయల రుణమాఫీ లబ్ధి పొందడం జరిగిందని అన్నారు. మాఫీ వర్తించిన రైతులందరికీ బ్యాంకు ను సంప్రదించి కొత్త రుణాలు తీసుకోవాలని సూచించారు. రుణమాఫీ పొందని రైతులు కూడా వారి వారి ఖాతాలను బ్యాంకు సిబ్బందితో సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని అన్నారు. రుణమాఫీ పొందిన రైతుల జాబితాను బ్యాంకు కార్యాలయంలో ఉంచడం జరిగిందని రైతులు నేరుగా బ్యాంకుకు వచ్చి లిస్టులో తమ పేరును పరిశీలించుకోవచ్చని అన్నారు. రుణమాఫీ కి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్న రైతులు తమ బ్యాంకు సిబ్బందిని సంప్రదించి వారి అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని అన్నారు.