మంత్రులను కలిసిన పిఏసిఎస్ చైర్మన్ మొoడయ్య

నవతెలంగాణ  – మల్హర్ రావు
మహా కుంభాభిషెకం కార్యక్రమంలో భాగంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో మహాకుంబాబిక మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోరాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ ముగురు మంత్రులు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ హాజరైయ్యారు. ఈ సందర్భంగా మంత్రులను తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొoడయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంటా కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్,మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య,నాయకులు జక్కుల వెంకటస్వామి యాదవ్, అజ్మీరా రాజు నాయక్, అడ్వాల మహేష్, యూత్ నాయకులు రాహుల్, గడ్డం క్రాoతి పాల్గొన్నారు.