నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం సోమవారం పీఏసీఎస్ అధ్యక్షుడు ఇప్ప మొండయ్య అధ్యక్షతన నిర్వహించునట్లుగా కార్యనిర్వహన అధికారి సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు కార్యాలయంలో నిర్వహించే ఈ సమావేశానికి పీఏసీఎస్ సభ్యులు,రైతులు సకాలంలో హాజరు కావాలని కోరారు. సొసైటీ ద్వారా .రైతులకు అందాల్సిన సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు సకాలంలో అందుతున్నాయా.? లేదా.? అనే దానిపై చర్చ సాగేనా.? తూతుమంత్రంగా సమావేశం ముగిసేనా.? అనే సందేహాలు సొసైటీలో సభ్యత్వం పొందిన రైతుల నుంచి పలు సందేహాలు వెలువడుతున్నాయి.