నవతెలంగాణ-జక్రాన్ పల్లి: మండలంలోని పడకల్ గ్రామంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన జరుగుతున్న తీరును, గ్రామసభలోని దరఖాస్తులను జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తనిఖీ చేసి పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. అదేవిధంగా అర్హులు గ్రామంలోని ప్రజాపాలన దరఖాస్తులను పరిశీలించి తగు సూచనలను చేశారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ యాదిరెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో తాహశీల్దార్ కలీం, ఇన్ చార్జి ఎంపీడీవో బ్రహ్మానందం, అర్గుల్ సర్పంచ్ గోర్తే పద్మా రాజేందర్, పలు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.