శ్రావణమాసం శనివారం రోజున మూడు రాష్ట్రాల సరిహద్దులో గల మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయానికి ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర కర్ణాటక మూడు రాష్ట్రాలకు చెందిన భక్తులు పాదయాత్ర ద్వారా బారులు తీరుతూ వేలాదిగా తరలివచ్చి ఆలయాన్ని సందర్శించి దర్శించుకున్నారు. శ్రావణమాసంలో భక్తులు ప్రతి శని సోమ ఈ వారాల్లో ఈ మూడు రాష్ట్రాల సరిహద్దు ఆలయానికి వేలాదిగా సందర్శించి దర్శించుకుంటారు. ముఖ్యంగా శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి దర్శించుకోవడంతో మూడు రాష్ట్రాల సరిహద్దు ఆలయం కిక్కిరిసిన భక్తులతో సందడే సందడి కనిపించింది.