గాంధారి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మాజీ ఎంపీటీసీ తూర్పు రాజులు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల నేత ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఆయన పార్టీ అధిష్టానాన్ని ముఖ్యమంత్రి రేవత్ రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా శనివారం గాంధారి మండల కేంద్రంలోని భోగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భోగేశ్వర ఆలయం నుండి పెద్ద పోతంగల్ గ్రామంలోని బుగ్గ రామేశ్వర ఆలయం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. పాదయాత్రలో మండలంలోని అన్ని గ్రామాల అన్ని తాండాల నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మదన్ హన్ కు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో స్థానం కల్పించాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.