ఖరీఫ్ సాగుకు అతి పెద్ద ‘పంట వరే’

– క్లస్టర్ పరిధిలో ప్రారంభమైన వ్యవసాయ పనులు
– వరి మొక్కజొన్న పత్తి కంది సాగు పంటలపై రైతుల దృష్టి
– సాగు విధానంలో సలహాలు, సూచనలు తప్పనిసరి
– తిమ్మాపూర్ రైతు వేదిక క్లస్టర్ అధికారి ఎం. చైతన్య 
నవతెలంగాణ-దుబ్బాక రూరల్
ఈయేడు వర్షాకాలం కాస్త ఆలస్యంగా ప్రారంభమవడంతో రైతులు చేసే పంట సాగు ఆలస్యం అవుతుంది. జూలై చివరి వారంలో తొలకరి వర్షాలు కురవడంతో రైతన్నలు పంటల సాగు పనులు బిజీ బిజీ గా చేస్తున్నారు. పంటల సాగు ప్రారంభమవడంతో ఫర్టిలైజర్ షాపు యాజమాన్యులు ఎరువులు విత్తనాలతో అందుబాటులో ఉంచారు. ఇక దుబ్బాక మండల పరిధిలోని తిమ్మాపూర్ రైతు వేదిక క్లస్టర్ పరిధిలో తిమ్మాపూర్, పద్మనాభుని పల్లి, మర్రికుంట,
హాసన్ మీరాపూర్, అప్పనపల్లి గ్రామాలు కలిపి 3600 ఎకరాల్లో  మొక్కజొన్న, కంది, పత్తి, వరి, ఆరుతడి పంటలు సాగు చేయనున్నారనీ అధికారులు చెబుతున్నారు.ఐతే మొత్తం 1975 మంది రైతులు పనుల్లో నిమగ్నమయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగంలో రైతుల సంక్షేమం కోసం తీసుకువచ్చిన పథకాలు, సాగుకై రైతులకు ఇస్తున్న రాయితీలు, రైతుల కోసం బాధ్యతాయుతంగా పనిచేస్తూ …ఎప్పటికీ అప్పుడు క్లస్టర్ పరిధిలోని రైతులకు సమాచారం చేరవేస్తున్న తిమ్మాపూర్ రైతు వేదిక క్లస్టర్ అధికారి చైతన్యతో నవతెలంగాణ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు.
విలేకరి ప్రశ్న1 –  క్లస్టర్ పరిధిలో ఎన్ని రకాల భూములు ఉన్నాయి? ఎంత విస్తీర్ణం సాగు అనుకూలం?
అధికారి జవాబు :  నల్లరేగడి, ఎర్ర రేగడి, ఇసుక , సౌడు భూములు కలిపి మొత్తం 3600 ఎకరాల భూమి కలదు.
విలేఖరి ప్రశ్న 2- ఎన్ని ఎకరాల్లో ఏ ఏ పంటలు రైతులు సాగు చేస్తున్నారు ? అందులో ఏ పంట అధికం?
అధికారి జవాబు: మొక్కజొన్న ,కంది(350 ఎకరాలు) వర్షాకాలంలో పత్తి (189 ఎకరాలు)
వరి (2300 ఎకరాలు) సాగుపంటలతో పాటు ఆరుతడి పంటలపై రైతుల దృష్టి సారింస్తున్నారు.
ఈ ఖరీఫ్ సాగులో “వరి పంటే “అధికం.
విలేఖరి ప్రశ్న 3 –  క్లస్టర్ పరిధిలో పామ్ ఆయిల్ సాగు జరుగుతోందా..?
అధికారి జవాబు: హాసన్ మీరాపూర్, అప్పనపల్లి, తిమ్మాపూర్ ,పద్మనాభుని పల్లి,మర్రికుంట గ్రామాల్లో మొత్తం 160 ఎకరాల్లో సాగు జరగాల్సి ఉంది అయితే ప్రస్తుతం 53 ఎకరాల్లో ఫామ్ ఆయిల్ సాగు ప్రక్రియ రైతులు చేస్తున్నారు .
విలేఖరి ప్రశ్న 4 – పామాయిల్ సాగుకు రైతులకు ఎంత మేరా రాయితీ సబ్సిడీలు ప్రభుత్వం అందిస్తోంది.? 
అధికారి జవాబు: పామాయిల్ పంట సాగు కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందుకు అనుగుణంగా మొక్కలు, డ్రిప్పుల పై సబ్సిడీ రాయితీలు కల్పిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ రైతులకు 100 శాతం, బిసి, ఓసి, మైనారిటీ రైతులకు రాయితీ సదుపాయాలు ఉన్నాయి. ప్రభుత్వం పామాయిల్ మొక్క ను ఒక రైతుకు 20 రూపాయలకే అందిస్తోంది. బయట ఈ మొక్క ధర 200 రూపాయలకు పైగా ఉంటుంది.
విలేకరి ప్రశ్న5- రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య ఎంత?
అధికారి జవాబు: తిమ్మాపూర్ రైతువేదిక వారిలో 1858 మంది రైతులు రైతుబంధు లబ్ధిదారులు.
విలేకరి ప్రశ్న 6- వర్షాకాలంలో ఎంత మేరకు పెట్టుబడి సహాయం అందింది, ఇంకా ఏమైనా మిగులు ఉందా?
అధికారి జవాబు: మొత్తం రూ..ఒక కోటి 83 లక్షల 26 వేల 596 అందాల్సి ఉంది అందులో ఒక కోటి 52 లక్షల 90 వేల 893 రూపాయలు రైతుల ఖాతాలో జమ అయ్యాయి. ఇంకా 57 లక్షల 35 వేల703 అందాల్సి ఉంది.
విలేకరి ప్రశ్న 7-కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం తీసుకొచ్చిన పథకాలు ఏమిటి?
అధికారి జవాబు: కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తో పాటు నాబార్డ్ ద్వారా రైతు సేవ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా పథకాలతో పాటు జనుము జిలుగు పచ్చి రొట్టె విత్తనాలపై 65% సబ్సిడీలు రైతులకు అందిస్తోంది.
విలేఖరి ప్రశ్న 8- వెదజల్లే పద్ధతిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారా… మీ క్లస్టర్ పరిధిలో ఎంతమంది రైతులు ఈ పంట సాగు చేస్తున్నారు.?
అధికారి జవాబు: ప్రభుత్వం రైతులకు వెదజల్లే పద్ధతి పై కల్పించే  కార్యక్రమంలో మేము భాగస్వామ్యం అవుతున్నాం. ఈ పద్ధతిలో రైతులకు  ఎదురయ్యే సమస్యలపై ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు అందిస్తున్నాం. మా క్లస్టర్ పరిధిలో ఇద్దరు రైతులు
హాసన్ మీరాపూర్ గ్రామానికి చెందిన రైతురాజిరెడ్డి (3 ఎకరాలు), తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రైతు మర్కంటి నరేష్  2 ఎకరాలు సాగు చేస్తున్నారు.
విలేఖరి ప్రశ్న 9-రైతులతో కలిసి సమీక్ష సమావేశాలు అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నారా?
అధికారి జవాబు: క్లస్టర్ పరిధిలోని 1975 మంది రైతులతో యాసంగి, వర్షాకాలం పంటల సాగు విషయంలో కాకుండా ప్రభుత్వం నిర్వర్తించే ప్రతి కార్యక్రమాన్ని రైతులతో కలిసి రైతు వేదికలో, ఆయా గ్రామ పంచాయతీల వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించి రైతులకు తలెత్తే సందేహాలను నివృత్తి చేస్తున్నాం.
సేంద్రియ ఎరువులు వాడి భూసారాన్ని పెంచండి
రైతులు వేసిన పంట కాలం పూర్తయిన తర్వాత రైతులు కాల్చడం వల్ల భూమిలో ఉండే సహజ సిద్ధమైన లవణాలు దెబ్బతింటాయి. భూమిలోని నత్రజని, ఫాస్పరస్ వంటి పోషకాలు లేక పంట దిగుబడి పై ప్రభావం పడుతుంది తద్వారా రైతులు నష్టపోయే అవకాశం ఉంది. దీన్ని అధిగమించాలంటే రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులతో పాటు పంట మార్పిడి విధానాన్ని కొనసాగించాలి. అప్పుడే భూసారం పెరిగి రైతు పండించే పంటల్లో అధిక దిగుబడి పొందవచ్చు.