నవతెలంగాణ- శంకరపట్నం
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ధాన్యం కొనుగోలు తూకాలు వేయాలని టిపిసిసి సభ్యులు శంకరపట్నం మండల మాజీ జడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కొనుగోలు చేసి ధాన్యాన్ని సేకరించాలని మండల పరిధిలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అధికారులు, చైర్మన్లు, పాలకవర్గ సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకొని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేసి ఎలాంటి కోతలు లేకుండా దిగుమతి చేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు ప్రభుత్వ ఉత్తర్వులను పాటించి ధాన్యాన్ని నాణ్యత పరిమాణాన్ని పాటించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని విక్రయించాలన్నారు. రైస్ మిల్లర్లు ఎలాంటి కోతలు లేకుండా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ధాన్యాన్ని దిగుమతి చేసుకొని రైతులకు అండగా నిలవాలని సూచించారు. వాతావరణం మార్పుతో వర్షాలు కురిసే ప్రమాదం ఉందని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని వేదవంతంగా తూకం వేసి మిల్లర్లకు తరలించాలన్నారు. రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేసిన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లి శాఖ పరంగా చర్యలు తీసుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు బసవయ్య, కాంగ్రెస్ పార్టీ యూత్ మండల శాఖ అధ్యక్షుడు మహమ్మద్ ఇషాముద్దీన్, బీసీ సెల్ మండల అధక్షుడు నాంపల్లి తిరుపతి, రైతు సెల్ మండల అధ్యక్షుడు తుమ్మేటి రాజిరెడ్డి, నాయకులు కల్లపెల్లి రాజయ్య, గొడిశాల ప్రవీణ్, ఒంగోని శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు,