రహదార్ల పైన వరి ధాన్యం ఆరపోయరాదు

Paddy should not dry on roads– ఎస్ ఐ అచ్చ కమలాకర్ పసర పోలీస్ స్టేషన్ 
నవతెలంగాణ – గోవిందరావుపేట 
జాతీయ మరియు గ్రామీణ అంతర్గత రహదారులపై  రైతులు ధాన్యం ఆరబోయరాదని పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ అచ్చ కమలాకర్ అన్నారు. మంగళవారం మండలంలోని జాతీయ రహదారి మరియు అంతర్గత రహదారుల వెంట ఉన్న రైతుల కు ఎస్ ఐ కమలాకర్ దాన్ని మారబోయడం వల్ల జరిగే నష్టాలను వివరించారు. రైతులు ఎవ్వరు కుడ వడ్లను జాతియ రాహదారుల పైనా కాని గ్రామ రహదారుల పైనా కాని ఆరపోయారాదు. ఇలా వడ్లను రహదారుల పైనా ఆరపోయడం వల్లన వాహనదారుల కి ఇబ్బంది కలగడమే కాకండా ప్రమదాలు జరుగుతాయి,కొన్ని సందర్బాలలో ప్రాణ నష్టం కుడ జరగవచ్చు .కావున రైతులు వారి వారి పొలంలో కల్లాలు చేసుకొని వడ్లు ఆరాపోసుకోవలసిందిగా గతంలో జరిగిన నష్టాలను ఉదాహరణలతో సహా వివరించారు.ఎవరైన నిబంధనలకు విరుద్దంగా వడ్లను రహదారుల పైనా ఆరపోయడం చేసినచో వారిపై చట్టరిత్య చర్య తీసుకోవడం జరుగుతుంది .కావున రైతులు ఈ విషయన్ని గమనించి పస్ర పోలీసులకు సహకరించాలనీ అన్నారు.