సీఎం కేసీఆర్ సారథ్యంలో నూతన సచివాలయాలు

– మామిడాలపల్లిలో జీపీ భవనం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి
నవతెలంగాణ – వీణవంక
సీఎం కేసీఆర్ సారథ్యంలో అన్ని గ్రామాలకు నూతన సచివాలయాలు నిర్మిస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మండలంలోని మామిడాలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆయన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జెడ్పీ ఛైర్ పర్సన్ కనుమల్ల విజయ, మహారాష్ట్ర సర్పంచులు, వీణవంక మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాలన్ని సుందరంగా ఉండాలనే లక్షంతో ముందుకెళ్తూ అనేక పథకాలను అమలు చేస్తూ అధిక నిధులు కేటాయిస్తూ గ్రామాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పాటుతుందని చెప్పారు. కావున సీఎం కేసీఆర్ తో పాటు తనకు ప్రతీ ఒక్కరూ అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుకాతిరుపతిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మావురపు విజయ భాస్కర్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి, సర్పంచులు బండ సుజాతాకిషన్ రెడ్డి, కొత్తిరెడ్డి కాంతారెడ్డి, బండారి మత్తయ్య, గంగాడి సౌజన్యాతిరుపతి రెడ్డి, ఎంపీటీసీలు మూల రజితా పుల్లారెడ్డి, నాగిడి సంజీవరెడ్డి, ఎంపీవో ప్రభాకర్, ఆర్ఐ గోనెల రవీందర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.