ఛలో కోరుట్ల కు తరలిన పద్మశాలిలు..

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి, ఇందల్ వాయి మండలాలకు చెందిన పద్మశాలి సంఘ సభ్యులందరూ “ఛలో కోరుట్ల “పద్మశాలి రాజకీయ యుద్ధభేరి” కార్యక్రమానికి మండలలలోని అంతా గ్రామల నుండి పద్మశాలి కుల సోదరులందరూ స్వచ్ఛందంగా వందలాదిగా కార్యక్రమానికి తరలి వెళ్లారు.ఈ సభను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా విజయవంతం చేసి నిరూపిస్తామని పద్మశాల మేమున్నామంటూ యుద్ధభేరిలో ప్రకటించడం జరుగుతుందని వివరించారు.తరలి వేళ్ళిన వారిలో రూరల్ పద్మశాలి సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ చిలువేరి దాస్, రూరల్ అధ్యక్షులు వాసు, నూకల రమేష్,చిలుక రాజు, జిల్లా పద్మశాలి సంఘ కార్యవర్గ సభ్యుడు శక్కరికొండ కృష్ణ, అధ్యక్షుడు అంకం నరహరి, రేగుంట విశ్వ ప్రకాష్, అంకం గిరి, రామకృష్ణ, వరకాల శ్రీనివాస్, హన్మంత్, లింబాద్రి, కొండ మురళి, లక్ష్మి నారాయణ, అంకం లడ్డు, రాంబత్రి ప్రసాద్, గణేష్, విట్టల్, లక్ష్మణ్, ఎమ్మాజీ గంగాధర్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.