బిసి కుల వృత్తుల్లో పద్మశాలిలను చేర్చాలి

– బహుజన లెఫ్ట్ పార్టీ-బి ఎల్ పి
– రాష్ట్ర ఉపాధ్యక్షురాలు – సబ్బని లత డిమాండ్
నవతెలంగాణ – కంటేశ్వర్
బీసీ కుల వృత్తుల్లో పద్మశాలీలను చేర్చాలి అని బహుజన లెఫ్ట్ పార్టీ బి ఎల్ పి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సబ్బని లత డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక విధానాల వల్ల పద్మశాలిలు చేనేత వృత్తిని కోల్పోయారని బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సబ్బని లత శనివారం ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం, రాష్ట్ర బీఆర్ఎస్ ప్రభుత్వం పద్మశాలిలను ఆర్థికంగా ఆదుకోకపోయిన పద్మశాలి కుటుంబాలు నూటికి 80% బీడీ కార్మికులుగా, ప్రైవేట్ అప్పులతో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని సబ్బని లత తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బిసి కుల వృత్తుల లిస్ట్ లో పద్మశాలిలను చేర్చి ప్రతి పద్మశాలి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పద్మశాలిలు తమ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.