బీజేపీ నేత ధన్ పాల్ నివాసంలో హంపి పీఠాధిపతికి పాదుక పూజ

నవతెలంగాణ-కంటేశ్వర్
నిజాంబాద్ నగరంలోని మార్వాడీ గల్లీలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ నివాసంలో శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి స్వామివారికి పాదుక పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చాలాసేపు స్వామి వారు వారి కుటుంబ సభ్యులతో గడపడం జరిగింది వారి యోగక్షేమాలు తెలుసుకొని హైందవ ధర్మాన్ని హిందూ ధర్మ పరిరక్షణలో ఎల్లప్పుడూ ఇలాగే ముందుండాలని సూర్యనారాయణ కి స్వామి వారు సూచించారు. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ స్వామివారు మా నివాసానికి రావడం చాలా అదృష్టంగా ఉందన్నారు స్వామీజీ కలలుగంటున్న హైందవ సమాజం కోసం ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉంటానన్నారు స్వామీజీ చూయించిన అడుగుజాడల్లో నడిచి వారి ఆశీస్సులతో ఇందూరు ప్రజలకు సేవ చేయడం లో నా పాత్ర కీలకంగా ఉంటుందన్నారు స్వామివారు మా కుటుంబ సభ్యులకు ఆశీర్వాదాలు ఇవ్వడం నా పూర్వజన్మ సుకృతం అన్నారు ఈ కార్యక్రమంలో ధన్ పాల్ మణిమాల , అంజలి, అర్చన, పింటూ, కాలనీవాసులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.