13న పెయిడ్ హాలిడే

– కలెక్టర్ హరిచందన  దాసరి
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ 
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పార్లమెంటు ఎన్నికల పోలింగ్ రోజైన ఈ నెల 13వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు, సంస్థలకు నెగోషియబుల్ చట్టం 1881 కింద నల్గొండ జిల్లా అంతటా  చెల్లింపు (పెయిడ్ హాలిడే) సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే విధంగా పార్లమెంటు ఎన్నికల నిర్వహణకై పోలింగ్ కేంద్రాలుగా వినియోగిస్తున్న విద్యా సంస్థలు, కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలల్లో ఎన్నికల పోలింగ్ ఏర్పాట్ల నిమిత్తంఈ నెల   12వ తేదీ సైతం సెలవుదినంగా ప్రకటిస్తున్నట్లు ఆమె తెలిపారు.