నవతెలంగాణ-భువనగిరి
కరోనా సమయంతో పాటు ప్రతి ఆపద సమయంలో ప్రజలకు అండగా మా నాన్న భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఉన్నారని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కూతురు పైళ్ల మన్విత రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం శాసనసభ ఎన్నికల్లో భాగంగా స్థానిక 19వ వార్డు కుమ్మరి వాడలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కుమ్మర్ల యొక్క స్థితిగతులను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో పందిల్ల భాస్కర్, తాడురి బిక్షపతి, ఇండ్ల శ్రీను, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి, ఇట్టబోయిన గోపాల్, మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, గోమారి సుధాకర్ రెడ్డి, నాగారం సూరజ్, శివ, అజరు, పద్మ పాల్గొన్నారు.