నవతెలంగాణ- వలిగొండ: రానున్న సార్వత్రిక ఎన్నికలలో భువనగిరి ఎమ్మెల్యే గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ని అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని ఆయన సతీమణి పైళ్ల వనిత అన్నారు. శుక్రవారం మండలంలోని ఎం తుర్కపెల్లి, పహిల్వాన్ పురం గ్రామాలలో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించి ఈ సందర్భముగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. వాటితో పాటు శేఖర్ రెడ్డి ఈ ప్రాంత ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వఛే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తుర్కపల్లి ఎంపీటీసీ తుమ్మల వెంకట్ రెడ్డి, గుండు శేఖర్ రెడ్డి, ఎడ్ల నిరంజన్ రెడ్డి, బట్టు నరేష్, పహిల్వాన్ పురం సర్పంచ్ తుమ్మల వెంకట్ రెడ్డి, ఎలిమినేటి జంగారెడ్డి, రాగీరు బాల రాజు, వనగంటి జంగయ్య, బెల్లి నర్సింహా, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.