ఆర్థిక సహాయం అందజేసిన పెయింటర్లు

నవతెలంగాణ-తుర్కపల్లి 
మండలంలో తిరుమలాపురం గ్రామానికీ చెందిన పబ్బోజ్ చంద్రమౌళి అనారోగ్యంతో మృతిచెందగా బుధవారం దశదినకర్మకు పెయింటర్ జనరల్ సెక్రెటరీ ఉట్కూరు సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు పెయింటర్ లు 7500 రూపాయలు ఆర్థిక సహాయం మృతుని కుటుంబానికి బియ్యం అందజేశారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పెయింటర్ సభ్యులు వెంకటేష్, శ్రీను, హుస్సేన్, శ్రీశైలం, పవన్, శ్రీధర్, సందీప్, కరుణాకర్, వంశీ, మనీ, భాను, వేణు, పెయింట్ షాప్ వనిత్, మహేష్ , నర్సింలు, సాయి, మధు, బబ్లు, కోశాధికారి శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.