పైసా వసూల్‌ సినిమా

పైసా వసూల్‌ సినిమావిశాల్‌, ప్రియా భవానీ శంకర్‌ హీరో, హీరోయిన్లుగా జీ స్టూడియోస్‌, స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా ‘రత్నం’ చిత్రాన్ని నిర్మించాయి. హరి దర్శకత్వంలో కార్తికేయన్‌ సంతానం దీన్ని తెరకెక్కించారు. ఈ మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్‌ బ్యానర్‌ పై తెలుగులో సీహెచ్‌ సతీష్‌ కుమార్‌, కే రాజ్‌ కుమార్‌ సంయుక్తంగా రిలీజ్‌ చేస్తున్నారు.
ఈనెల 26న ఈ సినిమా రాబోతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశాల్‌ మాట్లాడుతూ, ‘హరితో ‘భరణి, పూజ’ సినిమాలు చేశాను. అవి పెద్ద హిట్లు అయ్యాయి. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాబోతోంది. దేవీ శ్రీ ప్రసాద్‌ మంచి సంగీతం, ఆర్‌ఆర్‌ ఇచ్చారు. డైలాగ్‌ రైటర్‌ రాజేష్‌ వల్ల ఇది స్ట్రెయిట్‌ తెలుగు సినిమాలా అనిపిస్తుంది. మాతో కలిసిన ఆదిత్య మ్యూజిక్‌కు థ్యాంక్స్‌. ప్రియా భవానీ శంకర్‌ క్యారెక్టర్‌ ఈ సినిమాకు ప్రాణం. మీరు పెట్టే డబ్బులకు సరిపడా వినోదం ఇస్తాం. కచ్చితంగా పైసా వసూల్‌ సినిమా అవుతుంది. సతీష్‌ ఈ సినిమాను తీసుకున్నందుకు థ్యాంక్స్‌’ అని తెలిపారు.
‘విశాల్‌, హరి చిత్రాలంటే అలా పరిగెడుతూనే ఉంటాయి. ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఉన్నాయి. ఈ నెల26న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం’ అని డిస్ట్రిబ్యూటర్‌ సతీష్‌ చెప్పారు.