– ఆయుబ్, షకీల్ అర్ధసెంచరీలు
రావల్పిండి: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలిటెస్ట్‌లో పాకిస్తాన్‌జట్టు తడబడి నిలబడింది. టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 158 పరు గులు చేసింది. 16పరు గులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును సైమ్ ఆయుబ్(56), షకీల్(57) అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరూ 4వ వికెట్‌కు 98పరుగులు జతచేసి ఆదుకున్నారు. తొలిరోజు ఆట చివరిరోజు ఓపెనర్ ఆయుబ్(56) ఔట్ కాగా.. వికెట్ కీపర్ రిజ్వాన్(24) ధనా ధన్ బ్యాటింగ్‌తో రాణించాడు. క్రీజ్‌లో రిజ్వాన్, షకీల్ ఉండగా.. మాజీ కెప్టెన్ బాబర్ అజామ్(0), కెప్టెన్ షాన్ మసూద్(6) నిరాశపరిచారు. బంగ్లాదేశ్ బౌలర్లు షోరిఫుల్ ఇస్లామ్, హసన్ మహ్మద్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. పాకిస్తాన్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ ఈ పర్యటనకు వచ్చింది.