పాక్‌ ఎన్నికల ప్రహసనం!

Pakistan election farce!ఫిబ్రవరి ఎనిమిదిన పాకిస్థాన్‌ జాతీయ అసెం బ్లీ (పార్లమెంట్‌), నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్ని కలు జరిగాయి. రాష్ట్రాలలో ఒక్క సిం ధులో మాత్రమే పీపుల్స్‌ పార్టీకి స్పష్ట మైన మెజారిటీ వచ్చింది. జాతీయ అ సెంబ్లీ, మిగిలిన మూడు రాష్ట్రాలలో ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్‌ఖాన్‌ నాయకత్వం లోని నిషేధిత పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ (పిటిఐ) పార్టీ మద్దతుదార్లు స్వ తంత్ర అభ్యర్ధులుగా పోటీ చేసి ఇతర పార్టీలకంటే ఎక్కువ సీట్లు తెచ్చుకు న్నారు. జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 స్థానాలకు గాను 266 నియోజక వర్గాలలో ఎన్నికలు జరిగాయి. మిగిలిన 70 సీట్లలో 60 మంది మహిళలను రాష్ట్రాల వారీగా పార్టీలు తెచ్చుకున్న ఓట్లను బట్టి దామాషా పద్ధతిలో నియమిస్తారు. దేశమంతటి నుంచి మరో పదిమంది ముస్లిమేతర సామాజిక తరగతులకు చెందిన వారిని నామినేట్‌ చేస్తారు. ఎన్నికలు జరిగిన స్థానాలలో రెండు ఖాళీగా ఉన్నాయి. పార్టీల వారీ పిటిఐ బల పరిచిన స్వతంత్రులు 101 మంది గెలిచినట్లు వార్తలు వచ్చాయి. ఇది రాసిన సమయానికి 91 మంది పిటిఐ స్వతంత్రులు, ముస్లింలీగ్‌ (ఎన్‌) 80, పీపుల్స్‌ పార్టీ 54, ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్‌ (ఎంక్యుఎం) 17 సీట్లు తెచ్చుకోగా ఐదుగురు ఇతర స్వతంత్రులు, మరో పది చిన్న పార్టీలకు 17 స్థానా లు వచ్చాయి. అంతి మంగా పార్లమెంటు సమావే శాల నాటికి పార్టీల బలాబలాల్లో మార్పులు ఉండ వచ్చు. ఓటర్లలో 47 శాతం మంది పాల్గన్నారు.
నాలుగు రాష్ట్రాల ఎన్నికల వివరాలిలా ఉన్నాయి. ఖైబర్‌ ఫక్తూన్‌లోని 145 మొ త్తం స్థానాలకుగాను ఎన్నికలు జరిగిన 115లో 84 స్థానాలను పిటిఐ స్వతంత్రు లు గెలుచుకున్నారు. అతి పెద్ద పంజాబ్‌లో 371కి గాను ఎన్నికలు జరిగిన 297లో ముస్లిం లీగుకు 137, పీటిఐ స్వతంత్రులు 116, పీపుల్స్‌ పార్టీ పది స్థానాలు గెలుచు కుంది. మరో రాష్ట్రమైన సింధులో 168కి గాను ఎన్నికలు జరిగిన 130లో పీపుల్స్‌ పార్టీ 84, ఎంక్యుఎం 28, పిటిఐ స్వతం త్రులు 11 మంది గెలిచారు. ఇక్కడ పీపుల్స్‌ పార్టీ ఎవరి మద్దతు అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. బలూ చిస్తాన్‌లో 65కు గాను ఎన్నికలు జరిగిన 51 చోట్ల పీపుల్స్‌ పార్టీ, జమాతే ఉలేమాకు పదకొండు చొప్పు న ముస్లింలీగ్‌కు పది, మిగిలినవి స్వతంత్రులు, చిన్న పార్టీలకు వచ్చాయి. పంజాబ్‌లో ముస్లిం లీగ్‌కు మద్దతు ఇస్తామని, దానికి బదులు ప్రధాని పదవిని తమకు ఇవ్వాలని పీపుల్స్‌ పార్టీ తన డిమాండ్‌ను ముందుకు తెచ్చింది. పాకిస్తాన్‌లో 12.85 ఞకోట్ల మంది నమోదైన ఓటర్లు ఉన్నారు. వీరిలో 5.6 కోట్ల మంది 35ఏండ్లలోపు వారే.36-45 సంవత్సరాల వారు 2.9 కోట్ల మంది.మొత్తం ఓటర్లలో మహిళలు 46శాతమే. కాశ్మీరు నుంచి ఆక్రమించుకున్న ప్రాం తంతో పాటు గిల్గిట్‌-బాల్టిస్థాన్‌కు జాతీయ అసెం బ్లీలో ప్రాతినిధ్యం లేదు. వాటిని స్వతంత్ర విముక్త ప్రాంతాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్క డ విడిగా ఎన్నికలు నిర్వహిస్తారు. జాతీయ అసెం బ్లీకి 5,121 మంది, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 12,695 మంది పోటీ చేశారు. వీరిలో 882 మంది మహిళలు, నలుగురు ట్రాన్స్‌ జెండర్లు ఉన్నారు. అభ్యర్థులలో 11,785 మంది స్వతం త్రులు, వారిలో 607 మంది మహిళలు.
పాకిస్తాన్‌ గద్దె మీద ఇమ్రాన్‌ఖాన్‌ ఉండటం అమెరికాకు సుతరామూ ఇ ష్టం లేదు. అతగాడు చేసిన ”పాపం” ఏమిటంటే అమెరికాతో పాటు చై నా, రష్యాలతో కూడా సామరస్యంగా ఉం డాలన్న వైఖరి తీసుకోవటమే. తట స్థంగా ఉండటం కూడా తమను వ్యతి రేకించటమే అన్నది అమెరికా భావన, అందుకే అనేక దేశాధినేతలను కుట్ర చేసి కూల్చివేసిన చరిత్ర తెలిసిందే. ఇస్లామాబాద్‌లో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ తమకు మాత్రమే విధేయత చూపాలని అది కోరుకుంటున్నది. ఉక్రె యిన్‌ మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య 2022 ఫిబ్రవరి 24 నుంచి జరుగుతున్న సంగతి తెలిసిం దే. సరిగ్గా అదే రోజున మాస్కోలో వ్లదిమిర్‌ పుతిన్‌-ఇమ్రాన్‌ఖాన్‌ భేటీ జరిగింది. వివాదాన్ని సా మరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని ఖాన్‌ చెప్పాడు. రష్యాపై విధించిన ఆంక్షలను కూడా వ్యతిరేకిం చాడు. అది అమెరికాకు నచ్చలేదు. మార్చి ఆరవ తేదీన ఇమ్రాన్‌ఖాన్‌ ఒక పెద్ద బహిరంగ సభ నిర్వ హించాడు. దానిలో ఒక కాగితాన్ని చూపుతూ ‘రష్యా ను ఖండించాలని, వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరుతూ ఐరోపా యూనియన్‌ రాయబారులు ఒక లేఖ రాశారు. మీరు మా గురించి ఏమనుకుం టున్నారు. మీరేం చెబితే దాన్ని చేయటానికి మేము మీ బానిసలమా? మేము రష్యాకు, అమెరికాకు, చైనాకు, ఐరోపాకూ స్నేహితులమే. మేము ఎవరి శిబిరంలోనూ లేము. పాకిస్తాన్‌ తటస్థంగా ఉంటుం ది, ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించాలని కోరుకునే వారితో కలసి పనిచేస్తుంది’ అని ప్రకటించాడు. ఆ మరుసటి రోజే కుట్రకు తెరలేచింది. వాషింగ్టన్‌లో పాక్‌ రాయబారి అసాద్‌ మజీద్‌ ఖాన్‌తో జరిపిన సమావేశానికి దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల అమెరికా సహాయ మంత్రి డోనాల్డ్‌, మరో అధికారి వచ్చారు. ఆ సమావేశంలో డోనాల్డ్‌ మాటల సారం ఇలా ఉంది. ఉక్రెయిన్‌ అంశంలో పాక్‌ వైఖరి అమె రికా, ఐరోపాకు ఆందోళనకరంగా ఉంది. ఐరోపా దీన్ని ఎలా చూస్తుందో చెప్పలేము, నేనను కోవటం వారి స్పందన కూడా ఇలాగే ఉంటుంది. ఖాన్‌ గనుక అధికారంలో కొనసాగితే ఐరోపా, అమెరికా అతన్ని ఒంటరిపాటు చేస్తాయి.
అమెరికా సిఐఏ కుట్ర ప్రకారం సాకులు చూపి పాక్‌ చరిత్రలో తొలిసారి ఒక ప్రధాని మీద అవిశ్వాస తీర్మానం పెట్టి 2022 ఏప్రిల్‌లో ఖాన్‌ను పదవి నుంచి తొలగించారు. పిటిఐ పార్టీలో అంతర్గత ఎన్నికలు తమకు సంతృప్తి కలిగే విధంగా నిర్వ హించలేదని సాధారణ ఎన్నికల్లో పోటీకి ఎన్నికల కమిషన్‌ అనర్హత వేటు వేసింది, ఎన్నికల చిహ్నం క్రికెట్‌ బాట్‌ను స్తంభింప చేసింది. దాంతో ఆ పార్టీ అభ్యర్థులందరూ స్వతంత్రులుగా వేర్వేరు గుర్తులతో పోటీ చేయాల్సి వచ్చింది. వారంతా పార్లమెంటులో మరొక కొత్త పార్టీ పేరుతో ఒక బృందంగా ఏర్పడ తారా, ఏం జరుగుతుందో తెలియని స్థితి. వారిని చేర్చుకొనేందుకు ప్రధాన పార్టీలు ప్రలోభాలు, బెద రింపులకు పాల్పడుతున్నట్లు వార్తలు. పాక్‌ నిబంధ నల ప్రకారం వచ్చిన ఓట్ల దామాషా ప్రకారం పార్టీల కు నామినేటెడ్‌ సీట్లను కేటాయిస్తారు. పిటిఐ ప్రస్తు తం ఒక పార్టీగా గుర్తింపు లేనందున దానికి వచ్చే అదనపు సీట్లేమీ ఉండవు. గత ఎన్నికల్లో 31.82 శాతం ఓట్లతో పెద్ద పార్టీగా అవతరించి 336కు గాను 149 సీట్లను కైవసం చేసుకుంది.ఈ సారి ఏ పార్టీ కూడా సంపూర్ణ మెజారిటీకి అవసరమైన 169 సీట్లను తెచ్చుకొనే పరిస్థితి లేదు. ముస్లింలీగ్‌, పీపుల్స్‌ పార్టీ సంకీర్ణ కూటమి సర్కార్‌ ఏర్పాటుకు పూనుకున్నట్లు వార్తలు. డెబ్బయి ఒక్క సంవత్సరాల ఇమ్రాన్‌ ఖాన్‌కు మూడు కేసుల్లో 31 సంవత్సరాల జైలుశిక్షతో పాటు పదేళ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదనే అనర్హతను కూడా కోర్టు ప్రక టించింది.
ఈ పూర్వరంగంలో జరిగిన ఎన్నికలు ఎంత ప్ర హసనంగా సాగిందీ అర్ధం చేసుకోవచ్చు. ఓట్ల రిగ్గిం గు, లెక్కింపును సాగదీశారని, 24చోట్ల గెలిచినట్లు ప్రకటించిన వారికి వచ్చిన మెజా రిటీ కంటే చెల్లవని ప్రకటించిన ఓట్లే ఎక్కువని తేలిం ది. వాటిలో 13 సీట్లు ముస్లిం లీగ్‌కు, ఐదు పీపుల్స్‌ పార్టీ, నాలుగు చోట్ల పిటిఐ -స్వతంత్రులు, మరో రెండు చోట్ల ఇతర స్వతంత్రులు గెలిచారు. ఎన్నో ఆరోపణలు వెల్లు వెత్తినప్పటికీ 91మంది పిటిఐ మద్దతుదార్లు గెలిచారంటే పాక్‌ ఓటర్లు ప్రజాస్వామ్యాన్ని కోరుకుం టున్నారని, మిలిటరీ, న్యాయవ్యవస్థ కుట్రలను వ్యతిరేకిస్తున్నారని, అన్నింటికీ మించి ముఖ్యంగా యువత అమెరికా పట్ల వ్యతిరేకతను వెల్లడి స్తున్నారన్నది స్పష్టంగా కనిపిస్తోంది. అనేక విదేశీ మీడియా సం స్థలు వెల్లడించిన అభిప్రాయం కూడా ఇదే. ఈ అక్ర మాల గురించి పిటిఐ మద్దతుదార్లు, సాధారణ ప్రజానీకం ఎలా స్పందించేదీ చూడాల్సి ఉంది. దేశ రాజ్యాంగం ప్రకారం ఎన్నికల ఫలితాల నోటిఫికేషన్‌ వెలువడిన తరువాత 21 రోజుల్లోపు (ఫిబ్రవరి 29) కొత్త పార్లమెంటు సమావేశం కావాల్సి ఉంది. అంతకు ముందే కూడా ఏర్పాటు కావచ్చు. తొలుత స్పీకర్‌ ఎన్నిక, తరువాత సభా నేత (ప్రధాని) ఎన్నిక నిర్వహిస్తారు. ఈ పదవికి ఎందరైనా పోటీ పడ వచ్చు. సాధారణ మెజారిటీ 169 ఓట్లు తెచ్చుకున్న వారిని విజేతగా ప్రకటిస్తారు. ఆ మేరకు రాకపోతే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న తొలి ఇద్దరి మధ్య మరోసారి ఎన్నిక నిర్వహిస్తారు. తొలిరోజు సభ్యుల ప్రమాతణ స్వీకారం, మార్చి 1న స్పీకర్‌, రెండున ప్రధాని ఎన్నిక జరుగుతుంది. తరువాత సెనెట్‌ ఎన్నికలు జరుగుతాయి.
1985లో పార్టీ రహిత ప్రాతిపదికన ఎన్నికలు జరిగాయి. గెలిచిన వారందరినీ స్వతంత్రులుగా పరి గణించారు. తరువాత అత్యధికులు తాము పాకి స్తాన్‌ ముస్లిం లీగ్‌ అనే పార్టీగా ఏర్పడినట్లు ప్రకటిం చుకున్నారు. తరువాత ఆ పార్టీలో చీలికలు వచ్చా యి. ఇప్పుడు కూడా పిటిఐ మద్దతుతో గెలిచిన స్వతంత్రులు ఏదో ఒక పార్టీ పేరుతో ఏర్పడతారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఒకవేళ అలా ఏర్పడితే ప్రభుత్వం వేధింపులకు పాల్పడే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక మందిని అకర్షించేందుకు ప్రధాన పార్టీలు బేరసారాలు, బెదిరింపులకు దిగినట్లు వార్త లు వచ్చాయి. అందువలన పార్లమెంటు సమావేశం నాటికి పార్టీల బలాబలాల్లో మార్పులు జరిగే అవ కాశం లేకపోలేదు. నోటిఫికేషన్‌ ఇచ్చిన తర్వాత 3 రోజుల్లో స్వతంత్ర అభ్యర్ధులు పార్టీలను ఎంచుకో వచ్చు. తరువాత పార్టీలకు వచ్చిన ఓట్ల దామాషా లో నామినేటెడ్‌ సీట్లను కేటాయిస్తారు. తరువాత జాతీయ అసెంబ్లీ సమావేశం జరుగుతుంది.
ఎం కోటేశ్వరరావు
8331013288