ప్రధాని మోడీకి పాకిస్తాన్ ఆహ్వానం..

Pakistan invites PM Modiనవతెలంగాణ – ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీని పాకిస్థాన్ ప్రభుత్వం తమ దేశానికి ఆహ్వానించింది. వచ్చే అక్టోబర్ లో నిర్వహించబోయే కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (సీహెచ్ జీ) సమావేశంలో పాల్గొనేందుకు రావాలని కోరింది. మోడీతో సహా షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో)కు చెందిన ఇతర నేతలనూ పిలిచింది. ఈ సదస్సును ఇస్లామాబాద్ లో నిర్వహించేందుకు పాక్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గతేడాది ఈ సమావేశం బిష్కెక్ లో జరగగా.. విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరయ్యారు.
ఏమిటీ సీహెచ్ జీ..
ప్రాంతీయ భద్రత, మధ్య ఆసియా దేశాలతో సహకారం వంటి అంశాల పర్యవేక్షణకు ఏర్పాటైందే కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (సీహెచ్ జీ). రష్యా, చైనా నేతృత్వంలోని సీహెచ్‌జీలో భారత్‌, పాక్‌ సభ్యులుగా ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్ దీనికి అధ్యక్షత వహిస్తోంది. అక్టోబర్‌ 15-16 తేదీల్లో సీహెచ్ జీ శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే, ప్రత్యక్షంగా పాల్గొనే వీలు కుదరని నేతల కోసం వర్చువల్ విధానం ఏర్పాటు చేస్తారా లేదా అనేది పాక్ ఇంకా వెల్లడించలేదు.