‘శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో అలరించిన హీరో వెంకట్ ‘హరుడు’ చిత్రంతో మరోమారు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మైత్రి ఆర్ట్స్ అండ్ మైత్రి బాక్సాఫీస్ బ్యానర్‌లో వెంకట్ హీరో రూపొందుతున్న మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. శ్రీహరి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డా|| ప్రవీణ్ రెడ్డి, డా|| దిక్కల లక్ష్మణరావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా పనులు శరవేగంగా జరుగు తున్నాయి. నవంబర్‌లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ తాళ్లూరి మాట్లాడుతూ,’ఇది కంప్లీట్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే కథ. వెంకట్‌కి ఇది మంచి కమ్ బ్యాక్ మూవీ అవుతుంది’ అని అన్నారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, సలోని, నటాషా, అలీ, సుమన్, రవి వర్మ, సుభాశ్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాజ్ తాళ్లూరి, సంగీతం: మని జీన్న, డిఓపి: సన్నీ డి, ఆనంద్.